![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 మూడు వారాలు పూర్తయింది. మొదటి వారం శ్రష్టి వర్మ ఎలిమినేట్ అవ్వగా రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక మూడో వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యింది. మూడో వారం ఫ్లోరా సైనీ, రాము రాథోడ్, మాస్క్ మ్యాన్ హరీష్, పవన్ కళ్యాణ్ నామినేషన్లో ఉన్నారు.
ఇక నిన్నటి సండే ఫన్ డే ఎపిసోడ్ లో భాగంగా హోస్ట్ నాగార్జున సెలెబ్రిటీస్ తో వచ్చాడు. స్టార్ బాయ్ సిద్దూ కొత్త మూవీ ' తెలుసు కదా'.. అతని మూవీ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు. ఇక వారితో గేమ్స్ ఆడించాడు. వీటితో పాటు నామినేషన్లో ఉన్న ఐదుగురిలో నుండి ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరికి డేంజర్ జోన్‌లో ప్రియ, పవన్ కళ్యాణ్ మిగిలారు. ఇక వీరిద్దరిని నాగార్జున యక్టివిటీ ఏరియాకి పిలిచి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలెట్టాడు. దసరా కావడంతో సింహం బొమ్మని వీళ్ల మధ్యలో పెట్టి.. ఆ సింహం ఎవరివైపు చూసి గర్జిస్తుందో వాళ్లు సేఫ్.. అవతలి వాళ్ళు ఎలిమినేట్ అని నాగ్ చెప్పాడు. అయితే ఈ ప్రాసెస్ మొదలుకాగానే కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకంటే వారి మధ్య అగ్నిపరీక్ష నుండి బాండింగ్ ఉంది.
చివరికి కళ్యాణ్ వైపు చూసి సింహం గర్జించడంతో ప్రియ ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించారు. ప్రియ ఎలిమినేట్ కాగానే కళ్యాణ్ వెళ్లి పట్టుకొని ఎమోషనల్ అయిపోయాడు. వద్దు నువ్వు వెళ్లొద్దు.. ఉండిపో అంటూ కళ్యాణ్ తెగ ఏడ్చాడు. ఇక హౌస్ మేట్స్ అంతా ఏడ్చేశారు. ప్రియా శెట్టి హౌస్ నుండి ఎలిమినేషన్ అయింది.
![]() |
![]() |